![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీ అయినప్పటి నుండి గందరగోళంగా మారింది. ముఖ్యంగా దువ్వాడ మాధురి మాటతీరుకి అటు హౌస్ మేట్స్ కి ఇటు ఆడియన్స్ బుర్రపాడవుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సంజన, మాధురి కలిసి ఓ ప్రాంక్ చేశారు. పెద్ద గొడవ జరిగినట్టు సీన్ క్రియేట్ చేద్దాం.. కాసేపు మనమిద్దరం మాట్లాడుకోవద్దని మాధురితో సంజన అనగానే సరేనని తను అంది.
ఇక కాసేపటికి దువ్వాడ మాధురి తన యాక్టింగ్ మొదలెట్టింది. నా స్టిక్కర్స్ కనిపించట్లేదు పాపా.. బాత్రూం దగ్గరే పెట్టాను.. బాత్రూం క్లీనింగ్ ఎవరో రమ్మనండి.. అంటూ తనూజతో చెప్పింది మాధురి. సంజన గారు, ఇమ్మూ.. ఆ పని చేస్తున్నారని తనూజ అనగానే ఒకసారి ఇమ్మాన్యుయల్ ని రమ్మనండి అని మాధురి అడుగుతుంది. బాత్రూం దగ్గర ఉన్న అద్దం దగ్గర స్టిక్కర్స్ పెట్టాను నావి కనిపించట్లేదని మాధురి అడిగితే మా మమ్మీ అడిగినట్లుంది ఎవరివి ఇది అని అంటూ ఇమ్మూ చెప్పాడు. దీంతో సంజన నా స్టిక్కర్స్ ఏవి అని మాధురి అడిగితే పడేశానంటూ సంజన అంది. ఏంటి కామెడీగా ఉందా అని మాధురి అంది. లేదు చాలా మందిని అడిగాను.. ఎవరూ ఏం చెప్పలేదు అందుకే పడేశానంటూ సంజన చెప్పింది. అమ్మాయిల్ని కదా అడగాలి.. అబ్బాయిల్ని కాదని మాధురి వాదించింది. లేదు చాలా అవర్స్ అక్కడే ఉన్నాయని డిసిప్లేన్ కోసం పడేశానంటూ సంజన సమాధనమిచ్చింది. అవన్నీ కాదు నా స్టిక్కర్స్ నాకు కావాలి లేదా గుడ్డు దొంగతనం చేసినట్లు స్టిక్కర్స్ కూడా దొంగతనం చేశారా అని మాధురి ఫైర్ అయింది. లేదు నా స్టిక్కర్స్ ఉన్నాయి కావాలంటే అని సంజన చెప్పింది. లేదు నావి నాకు కావాలి.. మీ స్టిక్కర్స్ , మీ బట్టలు వేసుకోవడానికి నేను వచ్చానా అంటూ సంజన మీదా మాధురి ఫైర్ అవుతూనే ఉంది. ఇదంతా చూసి ఏంట్రా వీళ్ల గొడవ అని అందరు అవాక్కయ్యారు.
మీకు ఆల్రెడీ బోర్డ్ వేశారు కదా దొంగ అని మీకు అలవాటేమో అలా దొంగతనం చేయడమ మాధురి తిడుతుంటే సంజన నవ్వు ఆపుకోలేక హలో కట్ కట్.. తనే చెప్పింది స్టిక్కర్స్ కోసం గొడవపడదామని.. తనే చెప్పింది.. ఇది ప్రాంక్ అంటూ సంజన నవ్వింది. దీంతో హౌస్‌మేట్స్ అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని.. ఏంటో మాకీ కర్మ అన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. దివ్య అయితే కళ్యాణ్ వైపు చూస్తూ.. ఈ హౌస్ లో అందరూ మెంటల్ గాళ్లు కళ్యాణ్ అని సెటైర్ వేసింది.
![]() |
![]() |